బీర్కూర్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో గణేష్ విగ్రహ ప్రతిమల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఐ రంజిత్ వెల్లడిరచారు. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Read More »Daily Archives: August 27, 2022
మండలానికి సభాపతి పోచారం రాక
బీర్కూర్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మండలానికి విచ్చేస్తున్నారని మండల టీఆర్‌ఎస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా కార్డులను నెంలి సాయిబాబా ఆలయ ఫంక్షన్ హాలులో అందజేయనున్నట్లు చెప్పారు. మండలంలోని టీఆర్‌ఎస్ నాయకులు, ఆసరా లబ్ధిదారులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Read More »అన్నదానం…
బీర్కూర్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రావణ మాసం చివరి శనివారంను పురస్కరించుకుని నసురుల్లాబాద్ గ్రామ శివారులో గల సర్వాపూర్ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ అరిగే సాయిలు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
Read More »పిహెచ్. డి. నోటిఫికేషన్ విడుదల
డిచ్‌పల్లి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో డీన్ ఆచార్య కైసర్ మహ్మద్ శనివారం ఉదయం పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1, క్యాటగిరి – 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో క్యాటగిరి – 1 కి చెందిన యూజీసీ జెఆర్‌ఎఫ్ …
Read More »పందుల నిర్మూలనకై ధర్నా రాస్తారోకో…
నందిపేట్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలో పందుల సైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రోగాల బారిన పడుతున్నారని అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నారని గ్రామ అధ్యక్షులు పెదకాపు సుమన్ ఎద్దేవా చేశారు. నందిపేట మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి పందుల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా …
Read More »కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని (న్యూ కలెక్టరేట్)ను మంగళవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించారు. అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా తదితరులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సెప్టెంబర్ 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు న్యూ కలెక్టరేట్ కు ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో విస్తృత స్థాయిల్లో ఏర్పాట్లు చేయాలని …
Read More »ఒకేరోజు 59 ఆపరేషన్లు… మంత్రి అభినందన
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ఒకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజి,జనరల్ సర్జరీ,ఆర్థోపెడిక్, ఈఎన్టి, అప్తమాలజి విభాగాలలో ఈ సర్జరీలు చేయడం ప్రభుత్వ హాస్పిటల్స్ మెరుగైన పనితీరుకు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలని కార్పొరేట్ హాస్పిటల్స్‌కు …
Read More »అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం 2019 ఆగస్టులో ప్రవేశపెట్టిన టీఎస్-బీపాస్ యాక్టును పూర్తి స్థాయిలో పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ టీఎస్-బీపాస్ యాక్టు, పట్టణ ప్రగతి, హరితహారం తదితర …
Read More »