నందిపేట్, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ ముస్లిం మర్కజ్ కమిటీ ఎన్నికలు స్థానిక మదర్సలో ఆదివారం జనరల్ మీటింగ్ నిర్వహించి మాజీ ఎంపిటిసి అహ్మద్ ఖాన్‌ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిపేట్ గ్రామ ముస్లిం మర్కజ్ కమిటీ సాధారణ ఎన్నికల కొరకు ఆదివారం స్థానిక ఫలయ దారిన్ మదర్సలో గ్రామ ముస్లిం ప్రజలందరూ సమావేశమై ఏకగ్రీవ ఎన్నిక ద్వారా మాజీ ఎంపీటీసీ అహ్మద్ ఖాన్‌ను ఎన్నుకున్నారు.
అధ్యక్ష పదవి కొరకు 11 మంది సభ్యులు తమ పేర్లను ఇచ్చినప్పటికీ అహ్మద్ ఖాన్‌ను అధ్యక్షునిగా చేస్తే తామంత స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తొలగిపోతామని తెలువటంతో ఎన్నికలు జరగకుండా అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవ ఎన్నిక చాలా సంతోషకరమని మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు కలీం అహ్మద్ పేర్కొన్నారు.
ఇట్టి కమిటీ పదవీకాలం 2 సంవత్సరాలకు నిర్ణయించారు. గ్రామ ముస్లిం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికలను ఏకగ్రీవంగా చేసిన అందరికీ గ్రామ నూతన అధ్యక్షుడు అహ్మద్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోఆప్షన్ నెంబర్ సయ్యద్ హుస్సేన్, టిఆర్‌ఎస్ మైనారిటీ మండల ప్రెసిడెంట్ పాషా, ఇబ్రహీం మజీద్ కమిటీ అధ్యక్షుడు మహిమూర్, రహమానియ మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ బాబు, మస్జిద్ మోజ బిన్తే అధ్యక్షుడు షేక్ గౌస్, టిడిపి మండల అధ్యక్షుడు షేక్ జావీద్, పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.