కామారెడ్డి, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలోని రాశి వనంలో ఉన్న తేనెటీగల బాక్సులను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
తేనెటీగల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. తేనెటీగల పెంపకం ద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధి లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.