నవీపేట్, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శన యాత్రను నవీపేట్ మండలంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్ తల్లారే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేసి జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో వీటన్నింటిలో ఉన్నటువంటి సమస్యలను సర్వే చేసి విద్యార్థుల నుంచి వచ్చిన సమస్యలను ఒక కార్యాచరణ రూపం చేసుకుని ఉద్యమ పోరాటం చేయడానికి ఎస్‌ఎఫ్‌ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఉద్యమ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
హాస్టల్ సందర్శన బైక్ యాత్ర నవీపేట్ మండలంలోని బిసి బాలుర హాస్టల్లో ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకొని సర్వే నిర్వహించారు. అనంతరం బీసీ హాస్టల్ కమిటీ 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బైక్ యాత్ర పక్కనే ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్‌కి చేరుకొని అక్కడి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎస్సీ బాలుర హాస్టల్ కమిటీ ఏకగ్రీవంగా 14 మందితో ఎన్నుకున్నారు. మళ్లీ తిరిగి యాత్ర నవీపేట్ మండలం నుంచి రెంజల్ మండలం వెళ్లడం జరుగుతుంది. ఆదివారం రాత్రి ఎడపల్లి మండలంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్లో రాత్రి బస చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్ తల్లారే, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు ఉదయ్, డివిజన్ కమిటీ సభ్యులు చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.