కామారెడ్డి, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కానిస్టేబుల్ రాత పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
పరీక్ష కేంద్రాల్లో ఉన్న వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అధికారులను అడిగారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు ఏఎస్పి అన్యోన్య, చంద్రకాంత్, శంకర్ పాల్గొన్నారు.