Daily Archives: August 29, 2022

మా భూమిని కబ్జా చేశారు… న్యాయం చేయండి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్‌ గ్రామ శివారులో గల 65 సర్వే నంబర్లు 4 ఎకరాల 5 గుంటల భూమి, 66 సర్వే నెంబర్‌లో 25 గుంటల గల భూమిని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోటగిరి కృష్ణమోహన్‌ అనే వ్యక్తి తన భూమిని అక్రమంగా కబ్జా చేశారని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అదనపు …

Read More »

మగ్గం శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతులందరూ మగ్గం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇడబ్ల్యుఆర్‌సి శిక్షణ సంస్థలో ఆర్‌ఎస్‌ఇటిఐ శిక్షణ సంస్థ ద్వారా మగ్గం శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెలరోజుల పాటు జరిగే ఉచిత శిక్షణను వినియోగించుకోవాలని కోరారు. 35 మంది …

Read More »

రక్తదాత, అధ్యాపకుడు రమేష్‌ను అభినందించిన బాలు

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి డెంగ్యూ వ్యాధితో ప్లేట్‌ లేట్స్‌ పడిపోవడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్‌ బ్లడ్‌ ప్లేట్‌ లేట్స్‌ దొరకకపోవడంతో వారు ఐవీఎఫ్‌ అండ్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్‌ రమేష్‌కు తెలియజేయగానే వెంటనే స్పందించి సకాలంలో …

Read More »

పీఆర్సి వేతన పెంపు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేతన పెంపు బకాయిలు విడుదల చేయాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు యూనిఫాంలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి. యు) ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ కార్మిక …

Read More »

ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్‌ ఉత్సవాలు

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో వినాయక వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గణేష్‌ ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్‌ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఉత్సవాల …

Read More »

ప్రజావాణికి 87 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 87 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం తగదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు …

Read More »

టీయూలో వ్యాసరచన, వక్తృత్వం పోటీలు

డిచ్‌పల్లి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. అందులో భాగంగా సోమవారం ఉదయం వ్యాసరచన పోటీని ‘‘భారతదేశ సమగ్రాభివృద్ధిలో విద్యార్థుల భూమిక’’ అనే అంశంపై, మధ్యాహ్నం వక్తృత్వం పోటీని ‘‘జాతీయ …

Read More »

సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్‌) భవనాన్ని సెప్టెంబర్‌ 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతో మంత్రి …

Read More »

మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆభయ ఆంజనేయ ఆలయం, కల్కి నగర్‌ నందు వినాయక చవితి పండుగ సందర్బంగా 100 ఉచిత వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విగ్రహాల దాత కమిటీ సభ్యుడు కొత్త సంతోష్‌ కుమార్‌ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షులు అంభీర్‌ రాజేందర్‌ రావు, గంగ చరణ్‌, సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »