కామారెడ్డి, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి డెంగ్యూ వ్యాధితో ప్లేట్ లేట్స్ పడిపోవడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్ బ్లడ్ ప్లేట్ లేట్స్ దొరకకపోవడంతో వారు ఐవీఎఫ్ అండ్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు.
ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్ రమేష్‌కు తెలియజేయగానే వెంటనే స్పందించి సకాలంలో ప్లేట్ లేట్స్ అందించి ప్రాణాలను కాపాడడం జరిగిందని ఐవిఎఫ్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు.
ఈ సందర్భంగా రక్తదాత, అధ్యాపకుడు ఎమ్మెస్ రమేష్ మాట్లాడుతూ కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 2007లో ఏర్పాటు చేయడం జరిగిందని సమూహంలో క్రియాశీలక సభ్యునిగా ఎన్నోసార్లు ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేశానని తెలిపారు. రక్తదానానికి ముందుకు రావాలని రక్తదానం ప్రాణదానంతో సమానమని గత 15 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరుగుతుందని అన్నారు.
రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యులు గంప ప్రసాద్, ప్రశాంత్ పాల్గొన్నారు.