కామారెడ్డి, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం తగదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉంటుందని, ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జనహిత ద్వారా ఆన్లైన్లో వచ్చే ప్రతీ దరఖాస్తును అధికారులు పరిశీలించాలని అన్నారు. పెండిరగ్ దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.