కామారెడ్డి, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామ శివారులో గల 65 సర్వే నంబర్లు 4 ఎకరాల 5 గుంటల భూమి, 66 సర్వే నెంబర్లో 25 గుంటల గల భూమిని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోటగిరి కృష్ణమోహన్ అనే వ్యక్తి తన భూమిని అక్రమంగా కబ్జా చేశారని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌కు ఫిర్యాదు చేశారు.
అనంతరం కోటగిరి రాజు మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా తమకు చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని భూ కబ్జా చేశారన్నారు.
ప్రజావాణిలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కోటగిరి కృష్ణమోహన్‌కు అధికార రాజకీయ అండదండలు ఉన్నాయని ఇకనైనా అధికారులు తమకు న్యాయం చేసి తమ భూమిని తమకు ఇప్పించాలని కోరారు.