కామారెడ్డి, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగ యువతులందరూ మగ్గం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇడబ్ల్యుఆర్సి శిక్షణ సంస్థలో ఆర్ఎస్ఇటిఐ శిక్షణ సంస్థ ద్వారా మగ్గం శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెలరోజుల పాటు జరిగే ఉచిత శిక్షణను వినియోగించుకోవాలని కోరారు. 35 మంది యువతులు శిక్షణ పొందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్డిఓ సాయి న్న, ఆర్ఎస్ఇటిఐ సంస్థ డైరెక్టర్ కృష్ణ, ఇజిఎంఎం జెడిఎం హిమబాల, శిక్షకులు పాల్గొన్నారు.