కొత్త పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఆగష్టు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలంలో నూతనంగా మంజూరైన 1,551 నూతన అసరా పెన్షన్‌ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణి చేశారు. భిక్కనూర్‌ మండల కేంద్రంతో పాటు రామేశ్వర్‌ పల్లి, బస్వాపూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పంపిణి చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేసిన నూతన పెన్షన్‌లలో కామారెడ్డి నియోజకవర్గానికి 9 వేల 176 పెన్షన్‌లు మంజూరైనట్టు తెలిపారు. భిక్కనూర్‌ మండలానికి చెందిన లబ్ధిదారులకు పంపిణి చేసినట్టు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »