కామారెడ్డి, ఆగష్టు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్లో జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా గణేష్ విగ్రహానికి బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దంపతులు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, ప్రతినిధులు శివ కుమార్, దేవరాజు, శ్రీనివాస్ రెడ్డి, జుగల్ కిషోర్, కలెక్టరేట్ ఉద్యోగులు రాధాకృష్ణ, అశోక్, సాయి రెడ్డి పాల్గొన్నారు.