Monthly Archives: August 2022

క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కళాభారతిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేసే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. క్రీడల వల్ల వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని సూచించారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి జిల్లా …

Read More »

మిల్లింగ్‌ ప్రారంభించని రైస్‌ మిల్‌లపై చర్యలు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిల్లింగ్‌ ప్రారంభించని రైస్‌ మిల్‌ యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కలెక్టరేట్‌ లోని తన చాంబర్లు బుధవారం రైస్‌ మిల్లుల యజమానులు, డిప్యూటీ తహసిల్దార్లతో మిల్లింగ్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌ఎఫ్సిఐకి త్వరగా పంపించి నిర్ణీత గడువులోగా మిల్లింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సివిల్‌ సప్లై డిఎం …

Read More »

జిల్లా ఫెడరేషన్‌ అధ్యక్షులుగా ఎన్నికైన వైద్య అమృతరావు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఫెడరేషన్‌ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న బార్‌ అసోసియేషన్‌ బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బుధవారం కామారెడ్డి జిల్లా ఫెడరేషన్‌ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వైద్య అమృత రావు (కామారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు), ఉపాధ్యక్షులు పండరి (ఎల్లారెడ్డి …

Read More »

ప్రాంగణ నియామాకల్లో 9 మంది ఎంపిక

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ డిగ్రీ కళాశాలలో ముథూట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ వారు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 9 మంది అబ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయని కేర్‌ డిగ్రీ కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులకు ఆన్రోల్‌ ఉద్యోగం వెంబడే ఇస్తామని ముత్తుట్‌ ఫైనాన్స్‌ రీజియనల్‌ మేనేజర్‌ కొండ ఉపేందర్‌ తెలిపారు. కార్యక్రమంలో కేర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బాలకృష్ణ, ప్రతినిధి కొయ్యాడ …

Read More »

ఉర్దూలో మీర్‌ అబేద్‌ అలీకి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగంలో పరిశోధక విద్యార్థి మీర్‌ అబేద్‌ అలీకి పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) ను బుధవారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని మిని సెమినార్‌ హాల్‌లో నిర్వహించారు. ఉర్దూ పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్‌ అండ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. …

Read More »

టీయూ ఇంచార్జి రిజిస్ట్రార్‌గా బి. విద్యావర్ధిని

డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంచార్జి రిజిస్ట్రార్‌ గా వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ బి. విద్యావర్ధిని మంగళవారం నియమింపబడ్డారు. దీనికి సంబంధించిన ఆర్డర్‌ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా బుధవారం అందుకున్నారు. ఆచార్య బి. విద్యావర్ధిని ప్రస్తుతం ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇది వరకు కూడా ఆమె రిజిస్ట్రార్‌గా కొంత …

Read More »

ఈ దేశానికి నేనేమీ ఇవ్వాలి అనే భావన ఉండాలి

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా అధ్యక్షులు జితేశ్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా ఈ దేశానికి నేనేమి ఇవ్వాలనే భావన నేటి సమాజంలో ఉండాలని, రక్తదానం చేయడం …

Read More »

రక్తదాన శిబిరాలకు వెల్లువెత్తిన స్పందన

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వ యంత్రాంగం పిలుపునందుకుని రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని చాటారు. పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు …

Read More »

పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 3 నెలల పెండిరగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏఐటియుసి, మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌లకు మూడు నెలలుగా వేతనాలు …

Read More »

హుషారుగా సాగిన కవి సమ్మేళనం -ముషాయిరా

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి శీర్షికన జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఉర్దూ విభాగానికి ప్రాధాన్యతనిస్తూ ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకంగా ముషాయిరా కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం విశేషం. కార్యక్రమాలకు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించగా, నగర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »