Monthly Archives: August 2022

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల పరిష్కరానికి నిరంతరం పోరాటం చేయాల్సిందేనని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్‌ కోరారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఇటీవల జరిగిన మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సుధాకర్‌ను ఏఐటీయూసీ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం సంఘటితంగా పోరాడి సాదించుకోవడమే ఏకైక మార్గమన్నారు. మనం …

Read More »

నందిపేట్‌ ముస్లిం మర్కజ్‌ కమిటీ ఎన్నిక

నందిపేట్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ముస్లిం మర్కజ్‌ కమిటీ ఎన్నికలు స్థానిక మదర్సలో ఆదివారం జనరల్‌ మీటింగ్‌ నిర్వహించి మాజీ ఎంపిటిసి అహ్మద్‌ ఖాన్‌ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిపేట్‌ గ్రామ ముస్లిం మర్కజ్‌ కమిటీ సాధారణ ఎన్నికల కొరకు ఆదివారం స్థానిక ఫలయ దారిన్‌ మదర్సలో గ్రామ ముస్లిం ప్రజలందరూ సమావేశమై ఏకగ్రీవ ఎన్నిక ద్వారా మాజీ ఎంపీటీసీ అహ్మద్‌ ఖాన్‌ను …

Read More »

తేనెటీగల పెంపకంతో ఉపాధి

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలోని రాశి వనంలో ఉన్న తేనెటీగల బాక్సులను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. తేనెటీగల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. తేనెటీగల పెంపకం ద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Read More »

పరీక్ష కేంద్రాల తనిఖీ

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కానిస్టేబుల్‌ రాత పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో ఉన్న వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అధికారులను అడిగారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు ఏఎస్‌పి అన్యోన్య, చంద్రకాంత్‌, …

Read More »

మట్టి గణపతులువితరణ

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి సందర్భంగా కామారెడ్డి జిల్లా ఐవిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్‌ గుప్తా ఆధ్వర్యంలో వెయ్యి ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి హిందూ బంధువులు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ గణపతులు వాడవద్దని జల కాలుష్యం చేయవద్దని మట్టి గణపతి వాడాలని వివరించారు. ఆదివారము విశ్వనాధుల మహేష్‌ గుప్తా నివాసం …

Read More »

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హాస్టల్‌ సందర్శన యాత్ర

నవీపేట్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్‌ సందర్శన యాత్రను నవీపేట్‌ మండలంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్‌ తల్లారే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేసి జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో వీటన్నింటిలో ఉన్నటువంటి సమస్యలను సర్వే చేసి …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో 300 మంది చేరిక

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివ నగర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్‌ మండలంలోని అమార్ల బండ, ధర్మారావుపేట్‌, అడ్లూరు ఎల్లారెడ్డి, సదాశివ నగర్‌, గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ …

Read More »

గణేష్‌ విగ్రహ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి

బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గణేష్‌ విగ్రహ ప్రతిమల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఐ రంజిత్‌ వెల్లడిరచారు. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Read More »

మండలానికి సభాపతి పోచారం రాక

బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మండలానికి విచ్చేస్తున్నారని మండల టీఆర్‌ఎస్‌ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా కార్డులను నెంలి సాయిబాబా ఆలయ ఫంక్షన్‌ హాలులో అందజేయనున్నట్లు చెప్పారు. మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు, ఆసరా లబ్ధిదారులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

అన్నదానం…

బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రావణ మాసం చివరి శనివారంను పురస్కరించుకుని నసురుల్లాబాద్‌ గ్రామ శివారులో గల సర్వాపూర్‌ హనుమాన్‌ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అరిగే సాయిలు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »