డిచ్‌పల్లి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో డీన్ ఆచార్య కైసర్ మహ్మద్ శనివారం ఉదయం పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1, క్యాటగిరి – 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో క్యాటగిరి – 1 కి చెందిన యూజీసీ జెఆర్‌ఎఫ్ …
Read More »Monthly Archives: August 2022
పందుల నిర్మూలనకై ధర్నా రాస్తారోకో…
నందిపేట్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలో పందుల సైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రోగాల బారిన పడుతున్నారని అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నారని గ్రామ అధ్యక్షులు పెదకాపు సుమన్ ఎద్దేవా చేశారు. నందిపేట మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి పందుల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా …
Read More »కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని (న్యూ కలెక్టరేట్)ను మంగళవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించారు. అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా తదితరులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సెప్టెంబర్ 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు న్యూ కలెక్టరేట్ కు ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో విస్తృత స్థాయిల్లో ఏర్పాట్లు చేయాలని …
Read More »ఒకేరోజు 59 ఆపరేషన్లు… మంత్రి అభినందన
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ఒకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజి,జనరల్ సర్జరీ,ఆర్థోపెడిక్, ఈఎన్టి, అప్తమాలజి విభాగాలలో ఈ సర్జరీలు చేయడం ప్రభుత్వ హాస్పిటల్స్ మెరుగైన పనితీరుకు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలని కార్పొరేట్ హాస్పిటల్స్‌కు …
Read More »అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం 2019 ఆగస్టులో ప్రవేశపెట్టిన టీఎస్-బీపాస్ యాక్టును పూర్తి స్థాయిలో పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ టీఎస్-బీపాస్ యాక్టు, పట్టణ ప్రగతి, హరితహారం తదితర …
Read More »కొత్త పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆసరా పథకం కింద కొత్తగా దాఖలైన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సత్వరమే పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 3వ తేదీ లోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష …
Read More »మొక్కలు భావితరాల మనుగడకు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు నాటడం వల్ల అవి వృక్షాలుగా మారి భావితరాల మనుగడకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, అధికారులు పాల్గొన్నారు.
Read More »మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణ
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాలు శాంతియుతంగా జరగడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. విద్యుత్తు …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తికి జైలుశిక్ష
ఎడపల్లి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్యం సేవించి బైకు నడిపిన ఓ వ్యక్తిపై కేసు నమోదు కాగా, శుక్రవారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నెలరోజుల జైలుశిక్ష విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గోవూరి హన్మాండ్లు అనే వ్యక్తి మార్చి 21న మంగళ్‌పాడ్ చౌరస్తా వద్ద మద్యం సేవించి బైకు నడుపుతుండగా పోలీసుల తనిఖీలో పట్టుబడ్డాడు. ఎడపల్లి పోలీసులు …
Read More »అసత్యపు ప్రచారాలు మానుకోవాలి..
బీర్కూర్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ నాయకులు అసత్యపు ప్రచారాలు మానుకోవాలని లేకుంటే ప్రజలు తగిన బుధ్హి చెప్తారని మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పెరుక శ్రీనివాస్, ఎంపీపీ విట్ఠల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన కవితపై బీజేపీ గుండాలు చౌకబారు రాజకీయాలు చేస్తూ ఆమె ఇంటిపై దాడి చేయడం పిరికిపందపు …
Read More »