బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ నూతన కామన్‌ కోర్‌ సిలబస్‌ రూపకల్పన

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బయో టెక్నాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. ప్రవీణ్‌ మామిడాల సమన్వయ కర్తగా తెలంగాణలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ కామన్‌ కోర్‌ సిలబస్‌ రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు సమర్పించారు.

2022-23 విద్యా సంవత్సరం నుండి ఎంపిక చేసిన కొన్ని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ స్థాయిలో బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ని ప్రవేశపెట్టడానికి తెలంగాణ విద్యా ఉన్నత మండలి ప్రొఫెసర్‌ లింబాద్రి రిక్కా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కోర్సు సమన్వయకర్తగా డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, తెలంగాణ యూనివర్శిటీ, సభ్యులుగా యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ జెఎస్‌ఎస్‌ ప్రకాష్‌, ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ స్మితా పవార్‌, పాలమూరు యూనివర్శిటీ ప్రొఫెసర్‌ పిండి పవన్‌, ఐఐటి హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ పిండి పవన్‌ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ కళాశాల డాక్టర్‌ రాహుల్‌, డా. ఎఎస్‌ఎన్‌ పావని 3 నెలల పాటు బీఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌పై పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడంలో పనిచేశారు.

అదే విధంగా రూపొందించిన పాఠ్యాంశాలను చైర్మన్‌ సమర్పించారు. ఈ సందర్భంగా భారతదేశం మరియు విదేశాలలో ముఖ్యంగా బయోటెక్నాలజీ రంగంలో భారీ డిమాండ్‌ ఉన్న బిఎస్సీ బయోఇన్ఫర్మేటిక్స్‌ కోర్సును సిద్ధం చేసినందుకు మొత్తం కమిటీని తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి రిక్కా అభినందించారు.

బయోఇన్ఫర్మేటిక్స్‌ అనేది బయోటెక్నాలజీ మరియు ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ పరంగా అభివృద్ధి చెందుతున్న రంగం, ఇందులో వచ్చే 5 సంవత్సరాలలో 9000 కొత్త ఉద్యోగాలు భర్తీ చేయబడతాయన్నారు. డిగ్రీ కోర్సులో బయోటెక్నాలజీ మరియు కెమిస్ట్రీతో కలిపి బిఎస్‌సి బయోఇన్ఫర్మేటిక్స్‌ను ఏర్పాటు చేయబోతున్నమన్నారు. 3 సంవత్సరాల కోర్సును కూడా 2022-23 విద్యా సంవత్సరం నుండి కొన్ని ఎంపిక చేసిన డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »