విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ప్రాధామ్యాలకు సంబంధించిన పనులను చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గల రైతు వేదికలలో సివిల్‌ పనులన్నీ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

నిర్ణీత గడువు దాటిన తరువాత ఎక్కడైనా ఏ ఒక్క పని పెండిరగ్‌ ఉన్నా, సంబంధిత పంచాయతీరాజ్‌ ఏ.ఈలను సస్పెండ్‌ చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. విద్యుత్‌ పనులతో పాటు నీటి వసతితో కూడిన టాయిలెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు బీమా క్లెయిమ్స్‌ పెండిరగులో ఉండకూడదని, బాధిత కుటుంబాలకు తక్షణమే పంపిణీ చేసేందుకు చొరవ చూపాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

అలాగే, జిల్లాకు కొత్తగా 48వేల పైచిలుకు ఆసరా పెన్షన్లను ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో లబ్ధిదారులకు తక్షణమే మంజూరీ పత్రాలు పంపిణీ చేయాలని అన్నారు. అభ్యంతరాలు ఉన్న వాటిని మినహాయించి, మిగతా పెన్షన్ల మంజూరీ పత్రాల పంపిణీని రేపటి (శనివారం) లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే పెన్షన్‌ పొందుతున్న వారికి ఒకవేళ మళ్లీ కొత్తగా పెన్షన్లు మంజూరైతే అలాంటి వాటిని గుర్తించి రద్దు చేయాలని, మృతి చెందిన వారికి సంబంధించినవి, లబ్దిదారుల జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారు ఉన్నట్లయితే అలాంటి వాటిని కూడా వెనక్కి పంపాలని సూచించారు.

అయితే ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్‌ అందేలా చొరవ చూపాలని అన్నారు. కాగా, ఎడపల్లి, బోధన్‌, కోటగిరి, రుద్రూర్‌, వర్ని, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల పరిధిలో ప్రధాన రహదారికి ఇరువైపులా హరితహారం మొక్కల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని కలెక్టర్‌ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌ నిలదీశారు.

తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా మీదుగా వెళ్తున్న రెండు జాతీయ రహదారులకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ ఆకట్టుకునే రీతిలో ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడైనా మొక్కలు లేకుండా ఖాళీ ప్రదేశం కనిపిస్తే, సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే మొక్కలు నాటాలని, ఎక్కడబడితే అక్కడ నాటితే జీతాల నుండి నిధులు రికవరీ చేయిస్తామని అన్నారు.

బృహత్‌ పల్లె ప్రకృతి వనాల్లో ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. క్రీడా ప్రాంగణాలు ప్రతీ గ్రామ పంచాయతీలో కనీసం అర ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు అయ్యేలా చూడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ సునీల్‌, జెడ్పి సీఈఓ గోవింద్‌, డీఆర్డీఓ చందర్‌, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »