నిజాంసాగర్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి లో ముందుకు దూసుకెళుతుందని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో 1238 మంది ఆసరా లబ్ధిదారులకు మంజురైన పింఛన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి బాటలో ఉన్నాయని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి పనులు ఎన్నో జరిగాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయన్నారు.70 సంవత్సరాల పరిపాలనలో టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలించాయి కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్పీ సీఈవో సాయగౌడ్, ఎంపీడీవో నాగేశ్వర్, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విఠల్, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సాదుల సత్యనారాయణ, సిడిసి చైర్మన్ గంగారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, డిసిసిబి మాజీ డైరెక్టర్ మోహన్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు అహ్మద్ హుస్సేన్, సర్పంచులు కమ్మరి కత్త అంజయ్య, సుబ్బూరి సాయిలు, లక్ష్మీనారాయణ, లక్ష్మారెడ్డి, నాయకులు బాబు, ధపెదర్ విజయ్, యటకారి నారాయణ, గరబోయిన వెంకటేశం, శ్రీధర్ రెడ్డి, రెడ్యా నాయక్, బాబ్బర్, గైని రమేష్, తదితరులు ఉన్నారు.