కామారెడ్డి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో పదోన్నతి పై వెళ్లిన జిల్లా పశువైద్యాధికారి జగన్నాథచారికి సన్మాన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెడిఎ జగన్నాథ చారికి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ భరత్, దేవేందర్, పశు వైద్యులు, గోపాల మిత్రులు పాల్గొన్నారు.