కామారెడ్డి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15న జాతీయ నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని కాన్ఫరెన్స్ హాల్లో టాస్క్ఫోర్స్ సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12న మండల స్థాయిలో నట్టాల నివారణ మందుల పంపిణీపై టాస్క్‌ఫోర్స్ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నట్టల నివారణ మందులు వేయించాలని సూచించారు. అన్ని శాఖల సహకారంతో 100 శాతం విజయవంతం చేయాలని పేర్కొన్నారు. పోషణ అభియాన్ మాసోత్సవాలు నిర్వహించాలని కోరారు. అంగన్వాడి కేంద్రాల్లో బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి అదనంగా పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు.
సమావేశంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఐసిడిఎస్, మునిసిపల్, డిఆర్‌డిఏ అధికారులు పాల్గొన్నారు.