నిజామాబాద్, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగ సమష్యలు, నిరుద్యోగుల సమష్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ కాన్వాయ్‌ని అడ్డగించిన పిడిఎస్‌యు నాయకులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గిరిరాజ్ కళాశాలలో దగ్దం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పి.డి.ఎస్.యు. జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ కల్పన మాట్లాడారు.
ఈరోజు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో విద్యా రంగంపై చర్చించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అదేవిధంగా పెండిరగ్ ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్లో సొంత భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని పెండిరగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అందించాలని, ఉద్యోగ నోటిఫికేషన్ తో పాటు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలను కూడా ప్రకటించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల్లో, యూనివర్సిటీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిధులు విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమ నియమకాలపై చర్యలు తీసుకోవాలని అక్రమాలు చేస్తున్న వీసిని వెంటనే భర్తరాప్ చేయాలని,యూనివర్సిటీ సమస్యలపై విచారణ విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
లాఠీ చార్జీలు అరెస్టులు ఉద్యమాలను ఆపలేవని హెచ్చరించారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కేసీఆర్ ప్రభుత్వానికి విద్యార్థి లోకం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పి.డి.యస్.యు నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అషూర్ తెలంగాణ యూనివర్సిటీ కన్వీనర్, రిసెర్చ్ స్కాలర్ కర్క గణేష్, జిల్లా నాయకులు వేణు, సిద్ధార్థ్, రోజ ప్రసన్న, అఖిల, అక్షయ, మౌనిక జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు.