కామారెడ్డి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు ఇంద్రానగర్ కాలనీ శ్రీ విఘ్నేశ్వర యూత్ ఫెడరేషన్ చిరంజీనీ మధు ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీనీ మధు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక పండుగ సందర్భంగా ఐదవ రోజు కుంకుమార్చన కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
దీనికి కాలనీలోని మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమార్చనలో పాల్గొన్నారని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభవంగా వినాయక చవితి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో విఘ్నేశ్వర యూత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు, కోశాధికారి శేఖర్, వెంకటేశం, సురేందర్, రమేష్ పాల్గొన్నారు.