కామారెడ్డి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రం అశోక్ నగర్ కాలనీకి చెందిన స్వామి (28) యువకుడికి డెంగ్యూ వ్యాధితో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో అతనికి అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త అండ్ ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ నిర్వాహకుడు డాక్టర్ బాలును సంప్రదించారు.
వెంటనే స్పందించి పట్టణ కేంద్రానికి చెందిన వ్యాపారి జలిగామ సూర్య మోహన్‌కు తెలియజేయడంతో బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో డెంగ్యూ వ్యాధిగ్రస్తులు రోజురోజుకీ పెరుగుతున్నారని వారికి కావలసిన ప్లేట్ లెట్స్‌ను అందజేయడానికి రక్తదాతలు ముందుకు రావాలని కోరారు.
వెంటనే స్పందించి సకాలంలో ప్లేట్ లెట్స్ అందజేసిన రక్తదాత జలిగామ సూర్య మోహన్ కు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు డాక్టర్ వేదప్రకాష్, కేబిసి బ్లడ్ సెంటర్ టెక్నీషియన్ జీవన్ పాల్గొన్నారు.