కామారెడ్డి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్న మల్లారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో బోధన చేస్తున్న ప్రవీణ్ కుమార్కు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని కామారెడ్డి జిల్లా నుండి ఎంపిక చేసి రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ ప్రొబిషన్ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.
భౌతిక శాస్త్రంలో, ఖగోళ శాస్త్రములో నూతనమైన ఆవిష్కరణలను విద్యార్థులకు నేర్పించడంలో తన ప్రతిభను చాటి కామారెడ్డి జిల్లా నుండి ఒక్కరికి మాత్రమే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకోవడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్ అభినందనలు తెలిపారు.