కామారెడ్డి, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదితకు బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ స్వాగతం పలికారు.
కేంద్ర బృందం ప్రతినిధులు జనహిత గణేష్ మండలి గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూర్బన్ పథకం కింద జుక్కల్ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. చేపట్టిన అభివృద్ధి పనులపై షార్ట్ ఫిలింను చూశారు.
రూర్బన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనులు, రైతులకు కలిగిన ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్డిఓ సాయి న్న, అధికారులు పాల్గొన్నారు.