సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో విద్యుత్‌ శాఖ అధికారికి సన్మానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలోని సౌత్‌ విద్యుత్‌ శాఖ కార్యాలయానికి సబ్‌ ఇంజనీర్‌గా నూతనంగా బదిలీపై వచ్చి ఇన్చార్జ్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్‌కి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు హాజరయ్యారని బిక్నూర్‌ మండల అధ్యక్షులు కొమ్మరాజుల శ్రీనివాస్‌ అన్నారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి అసిస్టెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మండలంలో ఎలాంటి విద్యుత్‌ సమస్యలు ఉన్న సంప్రదించాలని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 ప్రతినిధులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఈ సందర్భంగా కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో మోతే లావణ్య, కొమ్మరాజుల శ్రీనివాస్‌, పప్పుల రవి, దన్నారపు రామకృష్ణ, తంబళ్ల సాయి కుమార్‌, నాగరాజు, విద్యుత్‌ శాఖ సిబ్బంది మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »