నందిపేట్, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల ఎస్ఐగా సల్ల శ్రీకాంత్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ఐగా కొనసాగిన మురళిని 2 నెలల క్రితం జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్ చేశారు. అప్పటి నుండి రెండవ ఎస్ఐగా ఉన్న అరిఫుద్దీన్ ఇంచార్జిగా కొనసాగుతున్నారు.
జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు ఆదేశాల మేరకు ఆర్మూర్లో రెండవ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ బదిలీపై వచ్చి నందిపేట్ ఎస్హెచ్ఓగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఆయనను స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు.