కామారెడ్డి, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యవివాహాలు జరగకుండా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి అధికారులతో బాల్య వివాహాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ప్రతినెల చివరి రోజున బాల్యవివాహాల నిర్మూలన, బడి మానేసిన పిల్లలపై గ్రామస్థాయిలో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో బాల కార్మికులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సిడబ్ల్యూసి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఐసిడిఎస్ అధికారిని రమ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.