కామారెడ్డి, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మాధవి (36) అనిమియాతో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో ఆమెకు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తము అవసరం కావడంతో జిల్లా కేంద్రానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి చేతన్ కృష్ణ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ నిర్వాహకుడు డాక్టర్ బాలు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధిగ్రస్తులు రోజురోజుకీ పెరుగుతున్నారని వారికి కావలసిన ప్లేట్ లెట్స్‌ను అందజేయడానికి రక్తదాతలు ముందుకు రావాలని కోరారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున రక్తదాత చేతన్ కృష్ణకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీ.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, యేసు గౌడ్ పాల్గొన్నారు.