కామారెడ్డి, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిపట్టణంలోని అనాథ వృద్ధురాలికి అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు దాస్ ఎల్లం సుగుణ అంత్యక్రియలు నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని రామరెడ్డి చౌరస్తాలో కిరాయికి ఉంటున్న అంగోత్ లక్ష్మీ (75), ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరు లేక అనాథగా జీవిస్తున్నారు.
వారు ఉంటున్న కిరాయి రూమ్ ప్రమాదకరంగా ఉన్నందుకు ఖాళీచేసి, రూమ్ దొరకక, చివరకు కామారెడ్డిలో శాబ్దిపూర్ తండాలోని అనాథ ఆశ్రమంలో కొన్ని రోజులుగా ఆశ్రయం పొందుతున్నారు. కాగా గురువారం ఉదయం 10 గంటలకు అనారోగ్యంతో మృతి చెందింది. ఎవరు లేని పక్షంలో కామారెడ్డి అనాథ ఆశ్రమ నిర్వాహకులు దాస్ ఎల్లం సుగుణ, బెతేల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు సంపత్, సందీప్, స్వామి అన్ని తామై అనాథ వృద్ధురాలి అంత్యక్రియలు జరిపించారు.