నిజామాబాద్, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఐ రాష్ట్ర మూడో మహాసభలకు హాజరై శంషాబాద్ హైదరాబాద్ నుండి నిజామాబాద్ వస్తుండగా ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడిరది. బస్సులో ప్రయాణిస్తున్న సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న, జిల్లా కార్యదర్శి పి సుధాకర్, జిల్లా నాయకులు ఓమయ్య, రాజేశ్వర్‌లకు గాయాలయ్యాయి.
గురువారం ఉదయం నాలుగు గంటలకు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుండి బోధన్ డిపో సూపర్ లగ్జరీ బస్సులో నిజామాబాద్ ప్రయాణమయ్యారు. మరో 20 నిమిషాల్లో నిజామాబాద్ చేరుకునే సమయంలో ప్రమాదం జరిగింది. ఈనెల 4 నుండి 7 వరకు శంషాబాద్‌లో జరిగిన మహాసభల ముగింపు అనంతరం తిరుగు ప్రయాణం సుమారు ఉదయం ఆరున్నర గంటలకు 44 వ జాతీయ రహదారిపై లారీనీ ఓవర్‌టేక్ చేస్తూ బస్సు డివైడర్ పైకి దూసుకు వెళ్లడంతో బస్సు బోల్తా పడిరది.
బస్సులో ఉన్న సిపిఐ రాష్ట్ర నాయకులు కె. భూమయ్య ఎడమ చేయి భుజంపై తీవ్ర గాయం అయింది. వెంటనే జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్, జిల్లా నాయకులు వై ఓమయ్య, రాజేశ్వర్ నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.