కామారెడ్డి, సెప్టెంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వర్గం వెంకటేష్ (35) నార్సింగ్‌కు అత్యవసరంగా ఓ పాజిటివ్ ప్లేట్‌లెట్స్ అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన దినేష్ గౌడ్ స్పందించి సకాలంలో రక్త కణాలను అందజేశారని ఐవిఎఫ్ తెలంగాణ రక్తదాతల సమన్వయకర్త, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని, డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్లేట్లెట్స్‌ను అందజేయడానికి సహకరిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా రోజురోజుకీ డెంగ్యూ కేసులు పెరగడం వల్ల చాలామంది ప్లేట్‌లెట్స్ అవసరమని సంప్రదిస్తున్నారని సాధ్యమైనంత వరకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, దాతలు మరింతగా ప్లేట్ లెట్స్ దానం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. రక్తదానం చేయాలనుకునేవారు 9492874006 నెంబర్‌కి సంప్రదించాలన్నారు.