కామారెడ్డి, సెప్టెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు శనిఆరం ఐఎస్‌ఓ సర్టిఫికేట్ లభించింది. కార్యక్రమానికి ఐయస్‌ఒ తరపున శివయ్య విచ్చేసి, ప్రభుత్వ విప్ యంఎల్‌ఏ గంప గోవర్ధన్ చేతులమీదుగా ఆర్.కె సిఈఒ డా.ఎం. జైపాల్ రెడ్డికి సర్టిఫికేట్ అందించారు.
ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్‌వో సర్టిఫికేట్ రావడం ఎంతో గొప్ప విషయమని కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల బిల్డింగ్, కంప్యూటర్ ల్యాబ్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ల్యాబ్స్, లైబ్రరీ మొదలగు వాటిని పరిశీలించిన అనంతరం ఆర్కే కళాశాల ఇన్ఫ్రా, ఫెసిలిటీస్ బాగున్నాయని తెలిపారు. అంతేగాక అత్యుత్తమ గ్రేడ్స్, యూనివర్సిటీ ర్యాంక్స్, కార్పొరేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ చాలా వాటిలో కూడా ఆర్. కె కళాశాల విద్యార్థులు ముందుండడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి ఐఎస్‌వో కలిగిన కళాశాల అర్‌కె అని అభినందించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల కరస్పాండెంట్ సీఈవో ఎం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల సమిష్టి కృషి అందరి సహకారం వల్లనే ఐఎస్‌వో సర్టిఫికేట్ రావడం ఎంతో ఆనందంగా ఉందని, నాణ్యమైన సదుపాయాలు, ఉన్నత విద్యా బోధన, ఉపాధ్యాయుల కృషి వీటన్నిటి వలన నేడు ఐయస్‌ఒ సర్టిఫికేట్ రావడం జరిగిందని దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, జిల్లా అధ్యక్షులు ముజీబొద్ధిన్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, ఐఎస్‌ఓ శివయ్య కళాశాల కరస్పాండెంట్ సీఈవో డా.ఎం జైపాల్ రెడ్డి, చైర్మన్ భాస్కర్ రావు, డీన్ నవీన్, ప్రిన్సిపాల్స్ సైదయ్య, గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ గడ్డం చంద్రశేఖర్ ఇందుప్రియ, ఎంపిపి పిప్పిరి ఆంజనేయులు, కామారెడ్డి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బల్వంథ్ రావు, వైస్ ప్రిన్సిపల్స్ గంగాధర్, ప్రభాకర్, రవి, బాలు మహేంద్ర, ఏవో శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.