హైదరాబాద్, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీఆర్‌ఏలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అసెంబ్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. 49 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించని కారణంగా తీవ్ర మనస్థాపానికి చెందిన ఇద్దరు వీఆర్‌ఏలు ఆత్మహత్యకు పాల్పడగా మరో 26 మంది గుండె పోటు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించారని సీఎల్పీ నేతకు వివరించారు.
తమ సమ్మె పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని అసెంబ్లీలో ఎండగట్టాలని వీఆర్‌ఏలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. వీఆర్‌ఏల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వీఆర్‌ఏలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.