నిజామాబాద్, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు నూతన కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెన్షనర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి తారీకునే పెన్షన్ చెల్లించాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పటిష్ట పరిచి నగదు రహిత వైద్యం అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులలో అనుమతించాలని వారు డిమాండ్ చేశారు.
పే రివిజన్ కమిషన్ చేసిన సిఫార్సులైన అంత్యక్రియల ఖర్చులు 30 వేలకు పెంచాలని, 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు తొమ్మిది వేల రూపాయలు చెల్లించాలని, గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌అమలుచేయాలని తదితర డిమాండ్లతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి మెమోరాండం సమర్పించారు.
నూతనంగా ప్రారంభమైన కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌కి అడిషనల్ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్ గార్లకు, రిటైర్డ్ ఉద్యోగులు సన్మానించారు. శాస్త్రుల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్రావు, ప్రసాద్, నరసింహ స్వామి, అందే సాయిలు, జార్జి, ఉషన్,దుర్గాప్రసాద్, సోమేశ్వర్‌లు, కృష్ణారావు, పుండరీ, సుదర్శన్, రాజు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.