కామారెడ్డి, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి / ఎంఇసి 60శాతం మాథ్స్ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్ 2021- 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న బాన్సువాడలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
కామారెడ్డి కలెక్టరేట్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో సోమవారం హెచ్‌సిఎల్ కంపెనీ ఉద్యోగాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో 2021 – 22 ఎంపిసి / ఎంఇసిలో అర్హులైన అభ్యర్థులు అర్హత పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు నకలు, ఒక ఫోటో ఆండ్రాయిడ్ మొబైల్‌తో డ్రైవ్ స్థలానికి తప్పకుండా హాజరుకావాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనప కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్రప్రతాప్, జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కిష్టయ్య, వివిధ ప్రవేట్ కళాశాలలో ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.