నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విమోచన ప్రాధాన్యతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణకు సంబంధించి మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »Daily Archives: September 13, 2022
కామారెడ్డిలో విమోచన ఉత్సవాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జన్మభూమి రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటురి శ్రీకాంత్ మాట్లాడుతూ 1947 ఆగస్ట్ 15న భారత దేశానికి స్వాతత్య్రం వచ్చినప్పటికీ నిజాం సంస్థానం …
Read More »జాతీయ స్థాయి అవార్డుల సాధనకు కృషి చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను నిజామాబాద్ జిల్లా ఎక్కువ సంఖ్యలో సాధించేలా ఆయా శాఖల అధికారులు సమిష్టిగా, పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 9 అంశాల ప్రాతిపదికన …
Read More »విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) నగర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం నగరంలోని కోటగల్లి, ఎన్‌ఆర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, పి.డి.ఎస్.యు మాజీ జిల్లా కార్యదర్శి కొంగర శ్రీనివాస్ రావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో …
Read More »ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని కలెక్టర్ సీ.నారాయణరెడ్డి గర్భిణీలకు సూచించారు. మోపాల్ వసతి గృహం ఆకస్మిక తనిఖీ చేసి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంగా 102 అంబులెన్సులో గర్భిణీ మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు జరిపించేందుకు తీసుకెళ్తుండడాన్ని గమనించిన కలెక్టర్ వాహనాన్ని నిలిపి, ఆశా వర్కర్లకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలతో కూడిన ఉచిత …
Read More »రెసిడెన్షియల్ స్కూల్… వసతి గృహం తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం కంజర గ్రామంలో గల ప్రభుత్వ సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, మోపాల్ లోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కంజర రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్, అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. కిచెన్, డార్మెటరీ, స్టోర్ రూమ్, టాయిలెట్స్ వద్ద గల వసతులను స్వయంగా …
Read More »ఈవిఎం కేంద్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కేంద్రం తాళాలను చూశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎన్నికల అధికారి సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం టేక్రియాల్‌లో ఉన్న అటవీ శాఖ నర్సరీని పరిశీలించారు. వారం రోజుల వ్యవధిలో మొక్కలను ఖాళీ …
Read More »కామారెడ్డిలో త్వరలో వ్యాయామ జిమ్
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :అక్టోబర్ మొదటి వారంలో జిమ్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలను పరిశీలించారు. జిమ్ కోసం అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని జిల్లా యువజన సర్వీసుల, క్రీడల అధికారి దామోదర్ రెడ్డికి సూచించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిమ్ కేంద్రం ఏర్పాటు కోసం …
Read More »343 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుపై అధికారులకు సమీక్ష నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం శుభ్రం చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. శుభ్రం చేసిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. …
Read More »అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తాము
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ నగరంలోని 4డివిజన్ల పరిధిలో సుమారు 60లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించినట్లు నగర మేయర్ దండు నీతూ కిరణ్ తెలిపారు. అభివృద్ధి పనులప్రారంభోత్సవ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త పార్టీలకు అతీతంగా నగర అభివృద్దే లక్ష్యంగా అన్ని ప్రాంతాల, డివిజన్ల అభివృద్దికై నిధులను …
Read More »