కామారెడ్డి, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అక్టోబర్ మొదటి వారంలో జిమ్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలను పరిశీలించారు. జిమ్ కోసం అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని జిల్లా యువజన సర్వీసుల, క్రీడల అధికారి దామోదర్ రెడ్డికి సూచించారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిమ్ కేంద్రం ఏర్పాటు కోసం గదిని పరిశీలించారు. త్వరలో పరికరాలను తెప్పించాలని సూచించారు. డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న జిమ్ పరికరాలను పరిశీలించారు. రెండిటికీ మరమ్మత్తులు చేయించాలని మునిసిపల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి షేక్ సలాం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.