నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ నగరంలోని 4డివిజన్ల పరిధిలో సుమారు 60లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించినట్లు నగర మేయర్ దండు నీతూ కిరణ్ తెలిపారు.
అభివృద్ధి పనులప్రారంభోత్సవ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త పార్టీలకు అతీతంగా నగర అభివృద్దే లక్ష్యంగా అన్ని ప్రాంతాల, డివిజన్ల అభివృద్దికై నిధులను మంజూరు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 100కోట్ల నిధుల మంజూరుకై కృషి చేశారని ఎమ్మెల్యేకి నగర ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
44వ డివిజన్ పిఎల్‌ఎంఎస్ పెట్రోల్ బంక్ ముందు కాలనిలో 10లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను, ద్వారక నగర్ బృందావన్ హాస్పిటల్ దారిలో 10లక్షల నిధులతో చేపట్టే బి.టి రోడ్డు పనులను ప్రారంబించారు. 57వ డివిజన్ బర్కత్ పురా కాలనీ ఎంఆర్‌ఎఫ్ షో రూమ్ వెనలక 10లక్షల నిధులతో చేపట్టే వి.డి.సి.సి రోడ్డు పనులను ప్రారంభించారు.
42వ డివిజన్ యస్.ఆర్ బేకరీ, చంద్రశేఖర్ కాలనిలలో 20లక్షల నిధులతో చేపట్టే బి.టి రోడ్డు పనులను ప్రారంభించారు. 45వ డివిజన్ ఎల్లమ్మ గుట్ట, ఎల్లమ్మ ఆలయం ముందు గల్లీలో 10లక్షల నిధులతో చేపట్టే బి.టి రోడ్డు పనులను ప్రారంభించారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, స్థానిక కార్పొరేటర్లు బైకన్ సుధ మధు, సిద్ధార్థ్ రెడ్డి, ఆకుల హేమాలత శ్రీనివాస్, తెరాస నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చరణ్ మున్సిపల్ ఇంజినీర్ అధికారులు వాజిద్, ఇనాయత్ కరీం, నటరాజ్ గౌడ్, శ్రీకాంత్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.