నిజామాబాద్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాష్ట్ర రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిలు హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాలపై సమీక్షించారు.

ఉమ్మడి జిల్లాకు మరిన్ని పంచాయతీరాజ్‌ రోడ్లు, డ్రైనేజీలు, సిసి రోడ్లు ఇవ్వాలని వారు కోరారు. తన నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో అవసరమైన నిధుల విషయం మంత్రి ఎర్రబెల్లి దృష్టికి మంత్రి వేముల తెచ్చారు. ఈ మేరకు మంత్రికి విజ్ఞపన పత్రాన్ని అందచేశారు.

ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రోడ్లు భవనాలు శాఖకు సంబంధించిన పరిస్థితులు, అవసరాలను వివరించారు. ఇద్దరు మంత్రులు వారి వారి శాఖలకు సంబంధించి సానుకూలంగా స్పందించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »