కామారెడ్డి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బీజేవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ జిల్లా కేంద్రంలోని అన్ని పుర వీధుల గుండా కొనసాగింది.
ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బిజెవైఎం జిల్లా ఇంచార్జ్, నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్ సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిజాం నిరంకుశ కబంధహస్తాల నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని సైనిక చర్య ద్వారా విముక్తి పొంది ఈ సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నాటి నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల గురించి, నిజాం అరాచకాలు గురించి నేటి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని, విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించి నాటి అమరుల త్యాగాల సాక్షిగా భవిష్యత్ తెలంగాణ నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.