నసురుల్లాబాద్, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లబాద్ మండలం దుర్కి గ్రామంలో గత శని వారం మరణించిన జింక సాయిరాజ్ కుంటుబాని కేంద్ర స్వతంత్ర బొగ్గు గనుల డైరెక్టర్ డాక్టర్ మురళిదర్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నసురుళ్ళబాద్ మండల శాఖ తరపున 5 వేల 500 రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుంటుబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియ, వారి కుంటుభానికి డబుల్ బెడ్ రూం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చందురి హన్మండ్లూ, పైదిమల్ లక్ష్మినారాయణ, చిదుర సాయిలు, కొత్తకొండ భాస్కర్, బూత్ అధ్యక్షులు జింక సుభాష్, బాక నాగరాజు, దుర్గం రమేష్, బాన్సువాడ మండల అధ్యక్షులు గుడుగుట్ల శ్రీనివాస్, బీర్కుర్ మండల అధ్యక్షులు నాగెళ్ళ సాయికిరణ్, రాజా సింగ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.