నిజామాబాద్, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ సి.నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులతో పాటు కలెక్టర్ సైతం భాగస్వాములయ్యారు.
1 – 19 సంవత్సరాల వయస్సు గల వారందరికీ నులి పురుగుల నివారణ కోసం అందించే అల్బెన్ డజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకునేలా చూడాలని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో, వసతి గృహాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులు తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాథోడ్, ఏ.ఓ గంగాధర్, నిర్వహణ అధికారి వెంకటేశం, విద్యార్థులు, ఏ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.