బీబీపేట్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండల కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతువేదిక వద్ద మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్‌ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందిని 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందని రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందన్నారు. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని ఇటీవలనే భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు జరుపుకున్నామన్నారు.

దానికి కొనసాగింపుగానే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను తెలంగాణ జాతి స్పూర్తిని ప్రతిబింబించెల మూడు రోజుల పాటు వైభవంగా జరపాలని నిర్ణయించారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటితో 74 సంవత్సరాలు నిండి 75 వ సంవత్సరంలోకి అడుగిడుతున్నామన్నారు. భారతదేశ బౌగోళిక నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజును తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా మనం ఘనంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా అన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ భాలమణి, సర్పంచ్లు తేలు లక్ష్మి సత్యనారాయణ, వెంకటరావు,టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్‌ గౌడ్‌, ఎంపీడీఓ పూర్ణ చందర్‌, ఎంపిటిసిలు పల్లవి భుమేశ్‌, నీరజ నర్సింలు, లక్కర్స్‌ రవి, ఉపసర్పంచ్‌ సాయినాథ్‌, ఎఎంసి డైరెక్టర్లు అది రాజయ్య, ప్రసాద్‌, బాపురెడ్డి, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ టౌన్‌ అధ్యక్షుడు పర్శరాంలు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, గ్రామ పంచాయతీ వార్డ్‌ సభ్యులు బాయికాడి వినోద్‌, పంపరి రాజు,మాజీ సర్పంచ్‌ గాడి లింగం, మాజీ ఎంపిటిసి ఛంద్రాగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, ఎంబరి స్వామి, దోమల సిద్దరాములు, బత్తిని జనార్ధన్‌, శ్యాగ సిద్దయ్య,పోచయ్య, రజనికాంత్‌, కుర్ల సిద్దారాములు, నర్సింలు, శ్రీనివాస్‌, వెంకటేశం, నందు, బాలరాజు, దడిగే నర్సింలు, ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »