కామారెడ్డి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి: టెక్ బీ – హెచ్ సిఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంలో చేరి, నేర్చుకుంటూనే ఉపాధి అవకాశం పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్‌గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇది సువర్ణ అవకాశం అని తెలిపారు. భారతదేశంలో నివసించే వారు, లిమేథ్స్/ బిజినెస్ మేథ్స్ లో 2021, 2022 ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఉత్తీర్ణులై, 60 శాతం ఓవరాల్, 60 శాతం గణితంలో మార్కులు పొందిన వారు దీనికి అర్హులన్నారు.
సాప్ట్వేర్ డెవలపర్, అనలిస్టు, డిజైన్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, సపోర్ట్ అండ్ ప్రాసెస్ అసోసియేట్ తదితర ఉద్యోగాలు ఉంటాయని ఆయన తెలిపారు. టెక్ బీ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులకు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్‌సీఎల్ కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగులుగా నియామకం ఉంటుందని ఆయన అన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ మరియు ఇంటర్న్‌షిప్ ఉంటాయని, రూ. 10 వేలు స్టెయిఫండ్ ఇవ్వబడునని ఆయన అన్నారు.
ప్రోగ్రాం పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్ని బట్టి ఏడాదికి రూ. 2.2 లక్షల వేతనంతో కెరీర్ ప్రారంభం అవుతుందన్నారు. అనంతరం అభ్యర్థులు బిట్స్ పిలాని, శస్త్ర యూనివర్సిటీ అందించే గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంను చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ టెక్బీ ఒక సంవత్సరం శిక్షణ కు అయ్యే రూ. 1.18 లక్షల ఫీజును ఎడ్యుకేషనల్ లోన్ ద్వారా చెల్లించే వెసులుబాటు హెచ్‌సిఎల్ కల్పిస్తుందన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి సంబంధించిన సెలక్షన్ డ్రైవ్ ఈ నెల 20 హెచ్.సి.ఎల్ కంపెనీ ద్వారా నిర్వహిస్తారని చెప్పారు.
ఆసక్తి గల అభ్యర్తులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఈ నెల 20న స్థానిక గవర్నమెంట్ జూనియర్ కళాశాల, బాన్సువాడలో హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. హాజరు సమయంలో ఎస్ఎస్ సి, ఆధార్ కార్డ్ , ఇంటర్ మీడియట్ ధృవీకరణలు వెంట తీసుకురావాలని తెలిపారు. ఈ నెల 20న సెలక్షన్ డ్రైవ్‌లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయని, అభ్యర్థులు ఉ. 9.30 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఇతర వివరాలకు, ం91 94935 53821 /8074065803 నెంబర్లను సంప్రదించాలని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.