పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలలో పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రఘురాం నాయక్‌, జిల్లా అధ్యక్షులుఅంజలి డిమాండ్‌ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్‌ జిల్లా కమిటీ అధ్వర్యంలో సోమవారం అడిషనల్‌ కలెక్టర్‌ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఫీజులపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతులు కల్పించడంలో లేదని, తెలంగాణ అడ్మిషన్స్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏలాంటి ఫీజులు పెంచలేదని నివేదిక ఇచ్చినప్పటికీ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి ఫీజులు పెంచేలా తెచ్చుకోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కొన్ని లక్షకు పైగా ఫీజులు పెంచడం దారుణమైన విషయమని ఏఐసీటీఈ, జేఎన్టీయూ, ఓయూ సైతం ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలకు వత్తాసు పలికినట్లు ఉందన్నారు.

తనిఖీలు నిర్వహించి క్లాస్‌ రూమ్‌, ల్యాబ్స్‌, టీచింగ్‌, స్టాఫ్‌ తో పాటు మౌలిక వసతులు ఎలా ఉన్నాయో అనేది పర్యవేక్షించకుండానే లక్షల సీట్లకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల తనిఖీలు నామ మాత్రంగానే ఉన్నాయని, రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఒకే రకమైన ఫీజులను నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఫీజులు తప్ప మరో ఆలోచన లేదని, పాసైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్‌ వచ్చాక సర్టిఫికెట్లు ఇస్తామంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడిరచారు.

మేనేజ్మెంట్‌ కోట సీట్లు సైతం యాజమాన్యాలు సీట్లను ఇష్టానుసారంగా లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన కమిటీని వేసి ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రఘు రాం, అంజలి కోరారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పెంచిన ఫీజులు వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రభుత్వ నికి డిమాండ్‌ చేయడం జరిగిందన్నారు.

అదేవిధంగా నిజామాబాద్లో గల విజయ్‌ ఇంజనీరింగ్‌ రూరల్‌ కాలేజ్‌ జేఎన్టీయూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని ఆరోపించారు. కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్‌ చేసారు. కార్యక్రమంలో ఎఐ ఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు కుశాల్‌, సుబోద్‌, నగర నాయకులు కరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »