నందిపేట్, సెప్టెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం డొంకేశ్వర్‌లో సోమవారం జరిగిన ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి సుదర్శనం సందర్శించారు. అనంతరం అయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఇలాంటి పరీక్షలు చేసి వెంటనే టీబి చికిత్స ప్రారంభిస్తే 2025 సంవత్సరం వరకు టీబిని అంతమోదించవచ్చు అని ఆనందం వ్యక్తం చేశారు.
నిజామాబాదు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల ప్రకారం గ్రామాలకు వెళ్లి టీబి అనుమానమున్న వారికి సోమవారం పరీక్షలు చేశారు. వ్యాన్ ఊరురా తిరుగుతూ అనుమానితులందరికి తెమడా పరీక్షలు, ఎక్స్ రే, ఇతర రక్త పరీక్షలు చేపట్టారు. దీని వల్ల త్వరగా టీబిని గుర్తించే అవకాశం ఉంటుందని వైద్య అధికారులు తెలిపారు.
డొంకేశ్వర్ గ్రామంలో సోమవారం టీబి కొరకు నమూనాలు, రక్త పరీక్షలు మరియు ఎక్స్ రే మొబైల్ వ్యాన్‌లోనే తిసారు. ఆరోగ్య మొబైల్ వ్యాన్ జిల్లాలో ఇంకా 14 రోజులపాటు గ్రామాల్లో పర్యటిస్తూ హాస్పిటల్‌కు వెళ్లలేని వారి నమూనాలను పరీక్ష చేస్తూ టీబిని గుర్తించడంలో సహాయకారిగా పనిచేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య అధికారి డాక్టర్ గంగా రెడ్డి, ఎంపీటి సి శ్రీనివాస్, సర్పంచ్ ఛాయా చందు, జిల్లా టీబి కో ఆర్డినేటర్ రవిగౌడ్, సూపర్‌వైజర్ ప్రమీల, సురేందర్, కౌన్సిలర్ స్రవంతి, లావణ్య, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.