కామారెడ్డి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఎఫ్, కామారెడ్డి రక్తదాతల సమూహం,రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా విచ్చేసి మాట్లాడారు.
కామారెడ్డి జిల్లా చరిత్రలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 189 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జిల్లా చరిత్రలో మొదటిసారి అని గత నెల రోజుల నుండి శిబిరం విజయవంతం చేయడానికి కృషి చేసిన డాక్టర్ బాలు, విశ్వనాధుల మహేష్ గుప్తా, డాక్టర్ వేదప్రకాష్, జమీల్ తదితరులను అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, అయ్యప్ప ఆలయంలో జంబి వృక్షాలను నాటడం జరిగిందన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఐవీఎఫ్ ఆధ్వర్యంలో నిరంతరం పాటు పడతామని పేద ఆర్యవైశ్యులకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను ఎల్లవేళలా అందిస్తామన్నారు.
తలసేమియా సికిల్ సెల్ సొసైటీ నిర్వాహకులు రత్నవలి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇంతమంది మంది రక్తదాతలు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని, రక్తదానానికి సహకరించిన నిర్వాహకులకు, రక్తదాతలకు సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు యాద నాగేశ్వరరావు, ఐ.వి.ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేష్ గుప్తా, సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్, ఐవిఎఫ్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గుప్తా, నారాయణ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కోశాధికారి గోవింద్ భాస్కర్ గుప్త, వలిపిశెట్టి లక్ష్మీరాజ్యం, ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలిపిషెట్టి భాస్కర్, గంప ప్రసాద్, అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితి అధ్యక్షుడు గందే శ్రీనివాస్, రెడ్ క్రాస్ జిల్లా సెక్రటరీ రఘుకుమార్, నరసింహము, పుట్ల అనిల్, కిరణ్, అడ్లూర్ ఎల్లారెడ్డి ఉప సర్పంచ్ లక్ష్మీపతి, వార్డు సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సుదర్శన్, ఆశిష్, పింజర్ల సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.