కామారెడ్డి, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామరెడ్డి మండల పరిధిలోని గొల్లపల్లిలో గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయితీకి సంబంధించిన ఆదాయ ఖర్చులు గ్రామ ప్రజలకు చదివి వినిపించారు. గ్రామ ప్రజలు పలు సమస్యలు విన్నవించగా గ్రామ సర్పంచ్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామములో ప్రతి ఇంటి వద్ద మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలని, ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుని వర్షం నీరు సంరక్షించాలన్నారు. ప్రతి ఇంటి దగ్గర పరిశుభ్రత పాటించాలని, పాత కుండీల్లో, టైర్లల్లో, కూలర్లలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని, వాటి వల్ల మలేరియా డెంగ్యూ వంటి దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యం అయ్యే పమ్రాదముందన్నారు.
అదేవిధంగా మంచి నీటి నల్లాలకు మూతలు బిగించుకోవాలని సూచించారు. పలు అభివృద్ధి పనుల విషయమై గ్రామ సభలో చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య మల్లేష్, ఉపసర్పంచ్ నర్సయ్య, వార్డు సభ్యులు రాజయ్య, మల్లయ్య, లింగం, సెక్రెటరీ జనార్దన్, ఆరోగ్య శాఖ, ఏఎన్‌ఎం, ఆశవర్కర్ లక్ష్మి, అంగన్‌వాడీ టీచర్ జ్యోతి, ఐకేపీ సీసీ ప్రతాప్, డీలర్ నాగరాజు, గ్రామ పెద్దలు, యువకులు కె.నరేష్, నవీన్, సాయిలు, గ్రామ పంచాయతీ సిబ్బంది నర్సింలు, సురేందర్, నర్సయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.