డిచ్పల్లి, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు.
ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 2462 నమోదు చేసుకోగా 2240 మంది హాజరు, 222 విద్యార్థులు గైర్హాజరు అయ్యారన్నారు. కాగా ఆర్మూర్ విజేత డిగ్రీ కాలేజి పరీక్షా కేంద్రంలో ఒకరు మాల్ ప్రాక్టీస్కుపాల్పడుతూ డిబార్ అయినట్టు తెలిపారు. ఆర్మూర్ విజేత డిగ్రీ కాలేజీ, సక్సెస్ డిగ్రీ కాలేజి ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ పరీక్షా కేంద్రాలను రిజిస్ట్రార్ ఆచార్య విద్యావర్ధిని, డా.సాయిలు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సందర్శించారు.